- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ వార్నింగ్… ఎమ్మెల్యేలు సైలెంట్..??
దిశ, వెబ్ డెస్క్: ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటుపై మొదట్లో ప్రగల్భాలు పలికినట్టు అధికార పార్టీ లీడర్లు ఇప్పుడు నోరు మెదపట్లేదు. మా జిల్లాను విడగొట్టకండి అంటూ గొంతెత్తి చెప్పిన సీనియర్ లీడర్ ధర్మాన కూడా సైలెంట్ అయిపోయారు. అధిష్టానమేమో 25 జిల్లాల ఏర్పాటుకు కమిటీని కూడా రంగంలోకి దింపేసింది.
మరి ఈ నేతలంతా ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు? ఏం పర్లేదు… మన నియోజకవర్గాన్ని జిల్లాగా మార్పించే పూచీ నాది అని హామీ ఇచ్చిన నేతలెక్కడ? మా జిల్లాను వేరు చేయొద్దు. మమ్మల్ని విడదీయొద్దు అన్న నాయకుల గొంతు మూగబోయిందేంటి? వీరి మౌనానికి కారణమేంటి?
ఆఆఆ… ఏముంటుంది…?? జగన్ కాస్త గట్టిగా గమ్మునుండవోయ్ అనుంటారు. అని ఫోనుల్లో గుసగుస లాడుకుంటున్నారట లోకులు. కరోనా కారణంగా వీధి అరుగు రాజకీయాల్లేవు కదా మరి. మొబైల్ పోలి’టాక్స్’ అనమాట. నేతల నోళ్లకు తాళాలు పడడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది.
కాగా గత క్యాబినెట్ భేటీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జరిగిన చర్చలో సీఎం జగన్ కొందరు మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇవ్వడమే నేతల మౌనానికి రీజన్ అని తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో తన వైఖరిని, ప్రభుత్వ ఆలోచనను ఇద్దరు మంత్రులకు క్లియర్ గా చెప్పారట జగన్.
కొత్త కొత్త డిమాండ్లని తెర మీదకు తీసుకురావద్దని… కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ బాధ్యతను మొత్తం అధికారులకే ఇస్తున్నాను. ఇందులో రాజకీయపరమైన జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదే లేదని హెచ్చరిక స్వరంతోనే ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.