- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు షాక్ ఇచ్చిన జగన్

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు సీఎం వైఎస్ జగన్ షాక్ ఇచ్చారు. ఏపీఐఐసీ చైర్మన్ పదవి నుంచి తొలగించారు. ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవర్థన్‌రెడ్డిని నియమిస్తూ వైసీపీ అధిష్టానం ప్రకటించింది. గతంలో ఎమ్మెల్యే రోజా మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. దీంతో ఆమెను బుజ్జగించేందుకు సీఎం జగన్ ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. తాజాగా ఆ పదవి నుంచి ఆమెను తప్పించారు. మరోవైపు కాపు కార్పొరేషన్‌చైర్మన్‌గా ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు సైతం షాక్ తగిలింది. కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయన పనిచేస్తున్నారు. సీఎం జగన్ తాజా నిర్ణయంతో ఆ పదవి నుంచి తప్పించారు. రాష్ట్రస్థాయిలో జోడు పదవుల విధానానికి ముగింపు పలకాలని సీఎం జగన్ భావించారు. అందులో భాగంగా కొందరు ఎమ్మెల్యేలకు ఇచ్చిన అదనపు పదవులను రద్దు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండు పదవులను అనుభవిస్తున్న ఎమ్మెల్యేలకు షాక్ తగిలినట్టైంది.