- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ల్యాప్ టాప్స్ పంపిణీ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం..
దిశ వెబ్ డెస్క్ : ఏపీలో సంక్షేమం అంటే నవరత్నాల అమలే అనేలా మార్చేసింది జగన్ ప్రభుత్వం. తాజాగా అమ్మ ఒడి , వసతి దీవెన పథకాలకు మారుగా ప్రభుత్వం లాప్ టాప్ ల పంపిణీకి ముందుకు వచ్చింది. విద్యార్థులకు డబ్బులు వద్దూ అనుకుంటే వారికి ల్యాప్ టాప్ లను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ల్యాప్ ట్యాప్ లను అందుకోవడంలో ఏవైనా అభ్యంతరాలు, అనుమానాలు వుంటే తెలపాలని ప్రభుత్వం లబ్దిదారులను అడుగుతోంది. ఇప్పటికే ల్యాప్ టాప్ లకు కొనుగోలు , టెండర్లు అన్నీ పూర్తి అయ్యాయి. అయితే ఈ టెండర్ల పరిమితి మించడంతో కొర్టు కలగజేసుకుంది. న్యాయ సమీక్ష తర్వాత అభ్యంతరాలు లేకపోతే పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు.
బేసిక్ కాన్ఫిగరేషన్‌తో 5.62 లక్షల ల్యాప్‌టాప్‌లు, నూతన కాన్ఫిగరేషన్‌తో 90,926 ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండర్లు పిలవనున్నారు. సరఫరా కోసం బిడ్లు దాఖలు చేయాల్సిందిగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కాంట్రాక్టర్లను కోరింది. దీనిపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియచేయాల్సిందిగా ప్రజలను కోరుతూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటల్లోగా ఏపీజ్యూడీషియల్ ప్రివ్యూ ఎట్ జీమెయిల్ డాట్ కామ్‌కు ఈ అభ్యంతరాలు, సూచనలు సలహాలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఓసారి అభ్యంతరాలు పరిశీలించాక ల్యాప్ టాప్ లపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోతోందని సమాచారం. అప్పుడు దాఖలైన బిడ్లను పరిశీలించి ల్యాప్ టాప్ ల కొనుగోలుకు తుది ఆర్డర్ ఇస్తం అంటోంది. ల్యాప్ టాప్ ల పంపిణీ ద్వారా విద్యార్ధులకు మేలు జరుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రతీ ఏటా అమ్మ ఒడి పథకాన్ని జనవరిలో అమలు చేస్తున్నందున ఆ లోపు డబ్బులు వద్దనుకునే వారికి ల్యాప్ టాప్ లు పంపిణీ చేయబోతున్నారు. తద్వారా ప్రభుత్వంపై ఆర్ధిక భారం కూడా తగ్గే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. డబ్బులే ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు భారం పెరుగుతోంది. ఆ మేరకు ఆర్ధిక వనరులు అందుబాటులో లేకపోవడంతో ల్యాప్ టాప్ ల పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లు తెలుస్తోంది.