- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కట్టడికి చర్యలు: జగన్
ఏపీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదన్నారు. ప్రజలు చింతించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రెస్‌మీట్ పెడతానుకోలేదని జగన్ అన్నారు. ‘చంద్రబాబు దగ్గరుండి వ్యవస్థలను నీరుగార్చుతున్నారు. కరోనా భయంకరమైన వ్యాధి కాదు. 60 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే కరోనా ప్రభావం ఉంటుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కరోనా వల్ల జనాలు చనిపోతారన్నది కరెక్ట్ కాదు. కేవలం 13.8 శాతం కేసులను మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా 85 శాతం బాధితులు ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు. 4.75 శాతం మాత్రమే క్రిటికల్ కేసులుగా నమోదయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే జనాలు బయటకు రావాలి’ అని జగన్ సూచించారు.
‘ ఏపీలో 70 కేసులు పరీక్షిస్తే.. కేవలం ఒక కేసు మాత్రమే పాజిటివ్‌గా వచ్చింది. తిరుపతి, విజయవాడలో ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. కాకినాడలో మరో ల్యాబ్ ఏర్పాటు చేయబోతున్నాం. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను గ్రామ వాలంటీర్లు సేకరిస్తున్నారు’ అని జగన్ తెలిపారు.
tag;cm jagan, press meet, corona, ap news