మాస్ హీరో కామెడీ మార్క్.. ‘జగమే తంత్రం’

by Shyam |
Jagame Thanthiram Teaser
X

దిశ, సినిమా : కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘జగమే తంత్రం’ టీజర్ రిలీజైంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాకు సంబంధించిన టీజర్.. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్ ఫన్‌తో నిండిపోగా.. ధనుష్ తన మార్క్‌ కామెడీతో మరోసారి హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. విలేజ్‌లో ఆకతాయిగా పెరిగి, రౌడీగా పేరు తెచ్చుకున్న ధనుష్.. విదేశాల్లో గ్యాంగ్‌స్టర్‌గా ఎలా అవతరించాడు? అక్కడి పోలీసులతో ఎలా ఆడుకున్నాడు? అనేది టీజర్‌లో చూపించగా.. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. థియేట్రికల్ రిలీజ్ గురించి ఇప్పటి వరకైతే ఎలాంటి సమాచారం లేదు. కాగా ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ ఫీమేల్ లీడ్‌ రోల్‌లో కనిపించబోతోంది.


Advertisement
Next Story

Most Viewed