- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీసీ పరిరక్షణకు జేఏసీ పోరాటం
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సమస్యలపై ఉద్యమించాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. ఈ మేరకు కార్యాచరణను రూపొందించుకున్నట్లు వెల్లడించారు. టీఎస్ఆర్టీసీ జేఏసీ సమావేశం ఎంప్లాయిస్యూనియన్కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై తీర్మానం చేశారు. అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తామని, ఈ నెల 31లోగా అన్ని రీజియన్లలో జేఏసీలు ఏర్పాటు చేస్తామన్నారు.
రీజియన్ జేఏసీల ఏర్పాటు కసం జోన్ల వారీగా బాధ్యతలను అప్పగించామని, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్గ్రేటర్రీజియన్లకు జేఏసీ చైర్మన్రాజిరెడ్డి, రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ రీజియన్లకు వైస్చైర్మన్హన్మంత్ముదిరాజు, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం రీజియన్లకు కన్వీనర్వీఎస్రావు బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 26న ఆర్టీసీ యాజమాన్యం వైఖరికి నిరసనగా లేబర్కమిషనర్గా ఫిర్యాదు చేస్తామని, వచ్చేనెల 3న హైదరాబాద్లో విస్తృతస్థాయి కార్మికుల సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
జేఏసీ వైస్చైర్మన్హన్మంత్ముదిరాజ్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి వచ్చేనెల 7న బస్భవన్ఎదుట నిరసన, 10న ఆయా డిపోల పరిధిలోని ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధి సమస్యల పరిష్కారానికి పార్లమెంట్సమావేశాల్లోనే నితిన్ గడ్కరీకి వినతిపత్రం ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కో కన్వీనర్లు అబ్రహం, యాదయ్య, సురేష్, యాదగిరి, రమేష్ కుమార్, హరికిషన్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.