ఆ రోజు అది తప్పైతే..ఈ రోజు ఇదీ తప్పే:ఐవైఆర్

by srinivas |
ఆ రోజు అది తప్పైతే..ఈ రోజు ఇదీ తప్పే:ఐవైఆర్
X

దిశ వెబ్‌డెస్క్: విశాఖపట్టణం విమానాశ్రయం వేదికగా నిన్న చోటుచేసుకున్న పరిణామాలపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ, ‘ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారిని విశాఖ విమానాశ్రయంలో ఆపడం ఎంత తప్పో ఈ రోజు ఇది కూడా అంతే తప్పు. జై అమరావతి అంటే అమరావతికి ప్రవేశం, జై విశాఖ అంటే విశాఖ ప్రవేశం మూర్ఖత్వం. ఎవరి విధానాలు వారివి. రాష్ట్రమంతా, దేశమంతా తిరిగి చెప్పుకునే స్వేచ్ఛ రాజ్యాంగం ఇస్తుంది. దానిని హరించడం ప్రమాదకరం’ అంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story