‘చియాన్ 60’.. తండ్రీకొడుకులతో సిమ్రన్ స్క్రీన్ షేర్

by Anukaran |   ( Updated:2021-03-10 06:50:15.0  )
simran acting in chiyaan 60
X

దిశ, సినిమా : కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘చియాన్ 60’ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్స్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చింది మూవీ యూనిట్. లలిత్ కుమార్ నిర్మిస్తున్న సినిమాలో తండ్రీకొడుకులు విక్రమ్, ధ్రువ్ విక్రమ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండగా.. ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ సిమ్రన్ ఆన్ బోర్డ్‌లోకి వచ్చేసింది. కార్తీక్ సుబ్బరాజు‌తో ‘పేటా’ చిత్రంలో పనిచేసిన సిమ్రన్, మరోసారి ఈ చిత్రం ద్వారా కొలాబరేట్ కావడం సంతోషంగా ఉందని చెప్పింది. డైనమిక్ ఫాదర్ – సన్ డుయోతో వర్క్ చేయబోతుండటం ఎగ్జైటింగ్‌గా ఉందని తెలిపింది. కాగా ప్రస్తుతం ‘అంధాదున్’ తమిళ్ రీమేక్‌తో బిజీగా ఉన్న సిమ్రన్.. ఈ చాన్స్ కొట్టేయడంపై హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. తన సెకండ్ ఇన్నింగ్స్ మరింత బిజీ అయిపోవాలని కోరుకుంటున్నారు.

ముందుగా ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నా.. ప్రస్తు్తం సంతోష్ నారాయణన్‌ ‘చియాన్ 60’కి పనిచేయబోతున్నట్లు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ప్రకటించారు. తమను అర్థం చేసుకున్నందుకు అనిరుధ్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

https://twitter.com/karthiksubbaraj/status/1369500006168879105?s=20

Advertisement

Next Story