స్నాప్‌డీల్‌కు పెరుగుతున్న వినియోగదారులు

by  |
స్నాప్‌డీల్‌కు పెరుగుతున్న వినియోగదారులు
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాతో సరిహద్దు వివాదం తర్వాత భారత ప్రభుత్వం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో దేశంలోని ఈ-కామర్స్(E-commerce) కంపెనీలకు బాగా కలిసి వస్తోంది. ప్రధానంగా గత కొంత కాలంగా స్తబ్దుగా ఉండిపోయిన స్నాప్‌డీల్(Snapdeal) లాంటి ఈ-కామర్స్ కంపెనీకి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా మారినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో స్నాప్‌డీల్‌తో పాటు ఇతర ద్వితీయ ఈ-కామర్స్ కంపెనీలకు(Secondary e-commerce company) పెరుగుతున్న ఆన్‌లైన్ ట్రాఫిక్ దీన్ని స్పష్టం చేస్తోంది.

గతంలో ప్రభుత్వం 59 చైనాకు చెందిన యాప్స్‌(Apps)ను నిషేధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో 200పైగా చైనా యాప్‌లను నిషేధించడంతో ఇన్నాళ్లు ఉన్న పోటీ తగ్గిపోయింది. దీంతో దేశంలోని వినియోగదారులు ప్రత్యామ్నాయం కోసం దేశీయ ఈ-కామర్స్ కంపెనీల(domestic e-commerce companies)వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు జపాన్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ సాఫ్ట్ బ్యాంక్ స్నాప్‌డీల్‌((Snapdeal)లో భారీగా పెట్టుబడులను పెట్టింది.

ఆ సమయంలో స్నాప్‌డీల్(Snapdeal), ఫ్లిప్‌కార్ట్(Flipkart) మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అనంతరం అమెజాన్(Amazon) రాకతో స్నాప్‌డీల్‌కు ఆదరణ తగ్గింది. పైగా, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్(Bollywood star Aamir Khan) వ్యాఖ్యల నేపథ్యంలో స్నాప్‌డీల్‌ను చాలామంది అన్ఇన్‌స్టాల్(Uninstall)చేశారు.

అప్పటినుంచి కష్టాలను ఎదుర్కొంటున్న స్నాప్‌డీల్ తాజాగా చైనా యాప్‌ల నిషేధంతో మళ్లీ గాడిన పడేందుకు ప్రయత్నిస్తోందని, వినియోగదారులు సైతం స్నాప్‌డీల్‌లో కొనుగోలును పెంచారని మార్కెట్ వర్గాలు(Market categories) చెబుతున్నారు. చైనా యాప్‌ల నిషేధంతో భారత్‌లో స్నాప్‌డీల్‌తో పాటు ఇతర ఈ-కామర్స్ కంపెనీలకు ఆర్డర్లు(Orders) పెరుగుతున్నాయన్ని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ద్వితీయ శ్రేణి ఈ-కామర్స్ కంపెనీల(Second tier e-commerce company)కు వినియోగదారులు పెరగనున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



Next Story

Most Viewed