- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐటీసీ నిర్వహణ లాభం రూ. 2,647 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్: ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ ఐటీసీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో స్వతంత్ర లాభం 26.18 శాతం తగ్గి రూ. 2,342.76 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ స్వతంత్ర లాభం రూ. 3,173.94 కోట్లుగా ఉంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 17.39 శాతం తగ్గి రూ. 9,501.75 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 11,502.82 కోట్లుగా నమోదైంది. ఇక, కంపెనీ నిర్వహణ లాభం రూ. 2,646.6 కోట్లుగా ఉంది. ఇక, ఐటీసీలో ఎక్కువ అమ్మకాలు జరిగే సిగరెట్ల ద్వారా వచ్చే ఆదాయం రూ. 3,853.79 కోట్లు ఉండగా, సిగరెట్‌తో సహా మొత్తం ఎఫ్ఎంసీజీ ఆదాయం రూ. 7,228.36 కోట్లని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. కాగా, ఐటీసీ కంపెనీ జూన్ త్రైమాసికంలో పన్ను చెల్లింపులను సగానికి పైగా తగ్గించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 785.67 కోట్ల పన్నులు చెల్లించింది. గతేడాది ఇది రూ. 1,637.80 కోట్లుగా ఉంది.