- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో జిల్లాల్లో ఐటీ టవర్లు !
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు 18శాతం పెరిగాయని, ఇది జాతీయ సగటు కంటే రెట్టింపు అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం హైదరాబాద్‌లో హైసియా వార్షిక కార్యక్రమంలో మాట్లాడుతూ.. హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచిందన్నారు. ఆఫీసు స్పేస్ వినియోగంలోనూ ఆరో స్థానం నుంచి రెండో స్థానానికి చేరామని, ఉప్పల్, పోచారం, కొంపెల్లి, శంషాబాద్ వైపు కూడా ఎస్ఎంఈలను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. నార్త్‌వెస్ట్‌లో కొల్లూరు వైపు కూడా కొత్త క్లస్టర్‌ను ప్రారంభిస్తామని, అటువైపు 30శాతం రెంటల్ సబ్సిడీ లభిస్తుందన్నారు. ఎవరైనా 500మందికి ఉపాధి కల్పిస్తే గ్రిడ్ ప్రాంతంలో కస్టమ్ ప్యాకేజీని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.
వారంరోజుల్లో కొంపెల్లి టవర్‌కు శంకుస్థాపన చేస్తామన్నారు. కరీంనగర్‌లో ఐటీ టవర్ ప్రారంభమైందని, త్వరలోనే ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ పట్టణాల్లోనూ టవర్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా హైసియా కొన్ని కంపెనీలకు అవార్డులను ప్రకటించగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు అవార్డు లభించింది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా టీసీఎస్ వీసీ వి.రాజన్న అవార్డు అందుకున్నారు.
హైసియా, అసోచాం, టై, నాస్కాం, ఎస్సీఎస్సీ భాగస్వామ్యంతో ఐటీ పరిశ్రమ నుంచి రూ.100 కోట్ల వరకు ప్రభుత్వానికి విరాళాలు సమకూరినట్లు మంత్రి వెల్లడించారు. ఈ విరాళాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ పరీక్షల పరికరాలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. కరోనా తగ్గుముఖం పట్టగానే 120 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైందని, అలాంటి పరిస్థితులు వస్తాయని ఎవరూ ఊహించలేదన్నారు.