మరో మూడు రోజులు వర్షాలు

by Shyam |
మరో మూడు రోజులు వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం తడిసిముద్దయ్యింది. పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడ రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీళ్లతో నిండిపోయాయి.

Advertisement

Next Story