గీతంలో ISTAM 65వ అంతర్జాతీయ సదస్సు..!

by Shyam |
గీతంలో ISTAM 65వ అంతర్జాతీయ సదస్సు..!
X

దిశ, పటాన్‌చెరు: హైదరాబాద్‌లోని గీతం యూనివర్సిటీలో ప్రతిష్టాత్మక ‘ద ఇండియన్ సొసైటీ ఆఫ్ థియోరిటికల్ అండ్ ఆప్లయ్ మెకానిక్స్ (ఇష్టమ్ లేదా ISTAM) 65వ అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్ సౌజన్యంతో గీతంలోని గణితశాస్త్రం, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో డిసెంబర్ 9,12 తేదీల్లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రొఫెసర్ కె.మారుతీ ప్రసాద్ వెల్లడించారు.

ఫ్లూయిడ్ మెకానిక్స్, సాలీడ్ మెకానిక్స్ రంగాల్లో యువ పరిశోధకులను ప్రోత్సహించే ప్రధాన లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సదస్సు ఇతివృత్తంపై ఔత్సాహికులు పత్ర సమర్పణ చేయవచ్చన్నారు. ఈ సదస్సులో పాల్గొనదలచిన వారు ఈ నెల 15 వ తేదీలోగా పేర్లు నమోదు చేయించుకోవాలని, ఇతరత్రా వివరాల కోసం www.istam2020.gitam.edu ను చూడాలని, లేదా istam2020@gitam.edu కు ఈ మెయిల్ చేయాలని సూచించారు.

Next Story

Most Viewed