వీణావాణిలకు హాల్‌టికెట్ల జారీ

by Shyam |   ( Updated:2020-03-14 00:32:20.0  )
వీణావాణిలకు హాల్‌టికెట్ల జారీ
X

దిశ, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణిలకు పదోతరగతి పరీక్షలు రాసేందుకు విద్యా శాఖ హాల్ టిక్కెట్లు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కవలలు యూసుఫ్‌గూడ స్టేట్ హోమ్‌లో ఉంటూ వెంగళరావు‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నారు. ఈ నెల 19 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరికి వేర్వేరుగా పరీక్ష పేపర్లు ఇవ్వాలని నిర్ణయించారు. స్టేట్ హోంకు సమీపంలోని మధురా‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. పరీక్షా విధానంలో జంబ్లింగ్ విధానం ఉన్నప్పటికీ అవిభక్త కవలలు కావడంతో అధికారులు వీరికి మినహాయింపు ఇచ్చారు.

tag; twins, veena – vani, 10th exams, hall tickets

Advertisement

Next Story

Most Viewed