- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దోశలో విషం పెట్టి నన్ను చంపాలని చూశారు : ఇస్రో సైంటిస్ట్ తపన్ మిశ్రా
దిశ,వెబ్‌డెస్క్: నన్నెవరో చంపేందుకు కుట్ర చేశారు. నేను ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూ సందర్భంగా దోశ తిన్నా. ఆ దోశ,చట్నీలో విషయం కలిపారు. కానీ ఆ విషయం నాకూ తెలియదు. తరువాత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డానంటూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉన్నతస్థాయి సైంటిస్టుల్లో ఒకరైన తపన్ మిశ్రా సంచలన ఆరోపణలు చేశారు.
మనదేశంలో ప్రముఖుల అనుమానాస్పద మరణాలు, కేసుల గురించి వినే ఉంటాం. 1971లో ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరక్టర్ శ్రీనివాసన్, ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ కేసు గురించి మనకు తెలుసు. కానీ నేను అలాంటి ప్రమాదంలో చిక్కుకుంటాని ఎప్పుడూ అనుకోలేదు. మే23,2017న ఇస్రో హెడ్ క్వాటర్స్ బెంగళూరులో ప్రమోషన్ ఇంటర్వ్యూ సందర్భంగా మధ్యాహ్నం లంచ్ తరువాత అత్యంత ప్రమాదకరమైన ఆర్సెనిక్ ట్రయాక్సైడ్ కలిపిన దోశ, చట్నీ తిన్నాను. ఆ విషయం నాకూ తెలియదు.
ఆ విషం కలిపిన దోశ తిని దాదాపు రెండు సంవత్సరాలు నరకయాతన అనుభవించారు. అనాల్ ద్వారా శరీరంలో 30-40% రక్తాన్ని కోల్పోయా. బ్రీతింగ్ సమస్యలు, తీవ్రమైన స్కిన్ అలెర్జీతో పాటు శరీరంపై చర్మం ఊడిపోవడం, కాళ్ళు మరియు చేతులపై గోర్లు కోల్పోవడం, హైపోక్సియా కారణంగా భయంకరమైన నాడీ సమస్యలు, ఎముకల నొప్పి, అనుమానాస్పద గుండెపోటుతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకడంతో శరీరంలో ప్రతీ అవయవంపై తీవ్రమైన ప్రభావం చూపిందంటూ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న మెడికల్ రిసిప్ట్ లను తపన్ మిశ్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ తపన్ మిశ్రాపై విష ప్రయోగం జరిగిన మూడేళ్ల తరువాత ఇప్పుడెందుకు ఈ విషయాన్ని వెల్లడించారో చెప్పలేదు.
అంతేకాదు ఇది ఎవరో గూఢచారులు చేసిన పనిగా భావిస్తున్నా, మిలిటరీ, కమర్షియల్ రంగాల్లో ఎంతో ఉపకరించే సింథటిక్ అపిర్చ్యూర్ రాడార్ నిర్మాణాన్ని ఆపడం నాటి వారి లక్ష్యం కావచ్చంటూ’ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఘటనపై భారత ప్రభుత్వం విచారణ జరిపించాలని ఇస్రో సైంటిస్ట్ తపన్ మిశ్రా కోరారు.