విద్యార్థులకు.. రిమోట్ సెన్సింగ్‌పై ఇస్రో ఫ్రీ 5 డేస్ కోర్స్

by Shyam |
ISRO
X

దిశ, ఫీచర్స్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఐదు రోజుల పాటు (జూలై 5 నుంచి 9) ‘రిమోట్ సెన్సింగ్’‌పై ఉచిత ఆన్‌లైన్‌ కోర్సును అందిస్తోంది. అంతరిక్షశాస్త్రంలో ఈ విధానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. రిమోట్ సెన్సింగ్ ద్వారానే ఉపగ్రహాలు అంతరిక్ష ఫొటోలను తీస్తాయి. ఈ కోర్సు నేర్చుకోవాలనుకునే 10,11,12 తరగతి విద్యార్థులను నుంచి ఇస్రో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, భూగ్రహ పర్యావరణం అధ్యయన ఉపయోగం గురించి విద్యార్థులలో అవగాహన పెంచడం కోసం ఇస్రో.. ‘యూజ్‌ఫుల్‌నెస్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్’ అనే కోర్స్ అందిస్తోంది. ఉపగ్రహ డేటా, ఇమేజ్ ప్రాసెసింగ్ ఉపయోగించడం వల్ల విద్యార్థులు పర్యావరణ చిక్కులను అర్థం చేసుకోవచ్చని ఇస్రో పేర్కొంది.

* 10, 11, 12 తరగతుల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం.
* ఐదు రోజుల కోర్సు (జూలై 26 – 30) తప్పనిసరిగా హాజరు కావాలి.
* ఈ పాఠాలు IIRS యూట్యూబ్ చానెల్‌లో ప్రత్యక్షంగా ప్రదర్శితమవుతాయి.
* ప్రతి రోజు 45 నిమిషాల చొప్పున ఉదయం 10 గంటలకు, మధ్యహ్నాం 12గంటలకు మొత్తంగా రెండు క్లాసులుంటాయి.
* విద్యార్థులకు వచ్చే సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం చాట్ బాక్స్‌లో ప్రశ్నలను అడగాలి. పాఠం పూర్తయిన తర్వాత ఐదు నిమిషాల విరామం సమయంలో సమాధానం అందుతుంది.
* ప్రతిరోజూ క్విజ్ ఉంటుంది
* ఒక విద్యార్థి ప్రత్యక్ష సెషన్‌ను కోల్పోతే.. IIRS లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (LMS) పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన రికార్డ్ వీడియోను చూడొచ్చు. ఇది ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్‌లోని గైడ్‌లైన్స్ ప్రకారం అప్లయ్ చేయాలి. అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. జేపీజీ, పీఎన్‌జీ ఫార్మాట్‌లోని ఫొటోను అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ప్రక్రియ పూర్తి కాగానే లాగిన్ క్రెడిన్షియల్ ఈమెయిల్‌లో పొందుతారు. దాని ద్వారానే ఎల్‌ఎమ్ఎస్ పోర్టల్‌లో లాగిన్ చేయగలుగుతారు. ఈ కోర్సు అప్లయ్ చేయడానికి జూలై 20 చివరి తేదీ కాగా, కోర్సు పూర్తి చేసినవారికి సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఇస్రో అధికారికి వెబ్‌సైట్‌ సందర్శించండి.

Advertisement

Next Story

Most Viewed