- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇస్రో నుంచి మరో చారిత్రాత్మక ప్రయోగం..
దిశ,వెబ్ డెస్క్: మరో చారిత్రాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ- 49 రాకెట్ ద్వారా 10 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు ఇస్రో రంగం సిద్దం చేసింది. ఈ మేరకు ఈఓఎస్-01 అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌తో పాటు మరో 9 విదేశీ శాటిలైట్లను ఇస్రో ప్రయోగించనుంది.
నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం(షార్)నుంచి ఈ రాకెట్‌ను శనివారం మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు ప్రయోగించనున్నారు. దీనికోసం శుక్రవారం మధ్యాహ్నం 1.02 గంటల నుంచే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రాకెట్ ప్రయోగాన్ని పరిశీలించేందుకు ఇప్పటికే ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు శ్రీహరికోటలోని షార్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో శ్రీ హరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. కాగా కరోనా నేపథ్యంలో శాస్త్రవేత్తలు మినహా వేరే ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు. ఇది షార్ నుంచి చేస్తున్న 76వ ప్రయోగం.. కాగా పీఎస్ఎల్వీ సిరీస్‌లో 51వ ప్రయోగం.
షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ- 49ను శనివారం సాయంత్రం 3.02 గంటలకు ప్రయోగించనున్నట్టు ఇస్రో ప్రకటించింది. ఈ నేపథ్యంలో మోడల్ రాకెట్ కు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలను ఇస్రో శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ద్వారా వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేయవచ్చని ఇస్రో తెలిపింది.