నెహ్రూ పార్క్‌కు ఐఎస్ఓ స‌ర్టిఫికెట్ హర్షణీయం: ఇంద్రకరణ్

by Shyam |   ( Updated:2020-12-16 09:18:54.0  )
నెహ్రూ పార్క్‌కు ఐఎస్ఓ స‌ర్టిఫికెట్ హర్షణీయం: ఇంద్రకరణ్
X

దిశ ప్ర‌తినిధి . హైద‌రాబాద్ : నెహ్రూ జూలాజికల్ పార్కుకు ఐఎస్ఓ సర్టిఫికెట్ రావ‌డం ఎంతో అభినంద‌నీయ‌మ‌ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జూ పార్క్‌లోని ప్రతీ విభాగంలో పాటిస్తున్న ఐఎస్ఓ ప్రమాణాలను గుర్తించి ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను ప్రధానం చేశారని ఆయ‌న తెలిపారు. ఈ మేర‌కు బుధ‌వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో జూ అధికారుల‌కు స‌ర్టిఫికెట్‌ను మంత్రి అంద‌జేశారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ… శానిటేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, యానిమల్ బ్రీడింగ్, జూ హాస్పిటల్, యానిమల్ కేర్, హైజీన్ మెయిన్టెనెన్స్ ఎస్టాబ్లిషమెంట్‌లను ఐఎస్ఓ నిపుణుల బృందం తనిఖీ చేసి ఐఎస్ఓ దృవ‌ప‌త్రాన్ని అంద‌జేశారని పేర్కొన్నారు.

జూ సిబ్బంది సమర్థవంతంగా, అంకితభావంతో పనిచేయటం, జంతువుల పట్ల మానవతా దృక్పధంతో సేవలందించడం , ప్రతి పనిలో పారదర్శకత, 24 గంటలు అన్ని అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది స్పందించే విధానం గొప్పగా ఉందని ఆయ‌న అన్నారు. యూకే అ్ర్ర్రకిడేషన్ కమిటీ ఇవన్నీ పరిశీలించి, ముఖ్యంగా జూ సందర్శకుల సంతృప్తిని కూడా పరిగణలోకి తీసుకుని సర్టిఫికేషన్ ప్రదానం కోసం అప్రూవల్ ఇచ్చిన‌ట్లు జూ అధికారులు తెలిపారు .

Advertisement

Next Story

Most Viewed