ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసు విచారణకు ది ఎండ్?

by Shamantha N |
ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసు విచారణకు ది ఎండ్?
X

దిశ, అహ్మదాబాద్: ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసు విచారణకు ది ఎండ్ కార్డ్ పడనున్నట్టు తెలుస్తున్నది. అహ్మదాబాద్‌లోని స్పెషల్ సీబీఐ కోర్టు ఈ కేసులో నిందితులుగానున్న ముగ్గురు పోలీసులను బుధవారం డిశ్చార్జ్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ కేసులో నిందితులే లేకుండా పోయారు. దీనిపై సీబీఐ అప్పీల్ చేయకుంటే దాదాపు కేసు విచారణ ముగిసినట్టేనని, కేసు క్లోజ్ అయ్యే అవకాశమున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2004 జూన్ 15న గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగర శివారుల్లో పాకిస్తాన్ పౌరులుగా చెబుతున్న ఇష్రత్ జహాన్, ప్రణేశ్ పిల్లై, అంజద్ అలీ రాణా, జీషన్ జోహర్‌లను పోలీసు అధికారి వంజారా సారథ్యంలోని క్రైం బ్రాంచ్ ఎన్‌కౌంటర్ చేసింది. అప్పటి రాష్ట్ర సీఎం నరేంద్ర మోడీని హతమార్చడానికి వారు వచ్చారని క్రైం బ్రాంచ్ పేర్కొంది.

ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని 2013లో దాఖలైన కేసులో పోలీసు అధికారులు పీపీ పాండే, వంజారా, ఎన్‌కే అమీన్, జేజీ పర్మార్, సింఘాల్, బారోట్, చౌదరీల పేర్లను సీబీఐ పేర్కొంది. అపహరణ, హత్య, సాక్ష్యాల రూపుమాపడం వంటి అభియోగాలు మోపింది. 2018లో పాండేను, 2019లో వంజారా, అమీన్‌లను కేసు నుంచి కోర్టు తప్పించగా, 2020లో పర్మార్ మరణించారు. తాజాగా, మిగిలిన ముగ్గురు సింఘాల్, బారోట్, చౌదరీలనూ తొలగించింది.

Advertisement

Next Story

Most Viewed