ఐపీఎల్‌కు ఇషాంత్ దూరం..?

by vinod kumar |
ఐపీఎల్‌కు ఇషాంత్ దూరం..?
X

పాత గాయం తిరగబెట్టడంతో పాటు కొత్త గాయం కూడా ఇబ్బంది పెడుతుండటంతో టీమ్ ఇండియా పేసర్ ఇషాంత్ శర్మను రెండో టెస్టు తుది జట్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే. కాగా, ఇషాంత్‌కు వైద్య పరీక్షలు చేసిన డాక్టరు కనీసం ఆరు వారాల (ఏప్రిల్ మూడో వారం వరకు) విశ్రాంతి అవసరమని తేల్చారు. దీంతో మార్చి 29 నుంచే ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో ‘లంబూ’ కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. కాగా ఇషాంత్ శర్మ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు.

అయితే ఇషాంత్ గాయంపై బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ ఫిజియో ఆశిష్ కౌషిక్ మీద బీసీసీఐ గుర్రుగా ఉంది. పాత గాయాలు తగ్గక ముందే ఇషాంత్‌కు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చి ఆగమేఘాల మీద కివీస్ పంపడం పట్ల బీసీసీఐ ఉన్నతాధికారులు అసంత‌ృప్తి వ్యక్తం చేశారని సమాచారం. కాగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ‘కగిసో రబాడా’ ఇప్పటికే గాయం కారణంగా తప్పుకోగా..ఇప్పుడు మరో పేసర్ ఇషాంత్ శర్మ సైతం అందుబాటులో లేకపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. మరి వీరిద్దరికి ప్రత్యామ్నాయంగా ఢిల్లీ జట్టు ఎవరిని తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story