300 వికెట్ల క్లబ్‌లో ఇషాంత్ శర్మ

by Shiva |
300 వికెట్ల క్లబ్‌లో ఇషాంత్ శర్మ
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా సీనియర్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ సోమవారం 300 వికెట్ల క్లబ్‌లో చేరాడు. చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ నాలుగవ రోజు డాన్ లారెన్స్ వికెట్ తీయడం ద్వారా తన కెరీర్‌లో 300వ టెస్టు వికెట్‌ను అందుకున్నాడు. కపిల్ దేవ్, జహీర్ ఖాన్ తర్వాత టెస్టుల్లో 300 వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్‌ ఇషాంత్ శర్మానే. ఇప్పటి వరకు 98 టెస్టులు ఆడిన మిగతా ఫాస్ట్ బౌలర్ల కంటే కాస్త ఆలస్యంగానే ఈ మార్కును అందుకున్నాడు. ఇషాంత్ శర్మ కెరీర్ అంతా ఆటుపోట్లతో నడిచింది. గాయాలు, ఫామ్ లేమి వల్ల చాలా సార్లు జట్టు నుంచి స్థానం కోల్పోయాడు. ఇక టీమ్ ఇండియా తరపున 300 వికెట్ల మార్కును ఇంతకు ముందు ఐదుగురు బౌలర్లు అందుకున్నారు. అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), రవిచంద్రన్ అశ్విన్ (383), హర్బజన్ సింగ్ (417), జహీర్ ఖాన్ (311) లు ఈ మార్కును చేరుకున్నారు.

Advertisement

Next Story