సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న డియోల్..

by Shyam |
సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న డియోల్..
X

దిశ, సినిమా : బాలీవుడ్ దివా ఈషా డియోల్ దాదాపు పదేళ్ల తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఒరిజినల్స్ ‘రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతోంది. ఈ క్రైమ్ డ్రామా ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న ఈషా.. బాలీవుడ్ మెగాస్టార్ అజయ్ దేవగన్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది. అప్లాజ్ ఎంటర్‌టైన్మె్ంట్, బీబీసీ స్టూడియోస్ ఇండియాతో కొలాబొరేట్ కావడం హ్యాపీగా ఉందన్న ఆమె.. నటిగా కొత్తదనాన్ని అన్వేషించేందుకు ఈ ప్రాజెక్ట్‌ ఉపయోగపడుతుందని నమ్ముతున్నానని.. ఇండియాలో ఇంతకు ముందెన్నడూ లేని కాప్ డ్రామాతో వస్తున్న థ్రిల్లింగ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు చార్జ్ చేయబడ్డానని తెలిపింది. ఈషా ప్రెజెన్స్ సిరీస్‌కు మరింత స్పార్క్ యాడ్ చేస్తుందని తెలిపారు నిర్మాతలు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌‌తో రిలేషన్‌షిప్ రిమార్కబుల్ సిరీస్‌ను క్రియేట్ చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు.

Advertisement

Next Story