- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీడబ్ల్యూఎంసీలో కొత్త కమిషనర్ జాడేది..?
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థకు కమిషనర్ నియమాకంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం వహిస్తూనే ఉంది. గతనెల 13న అప్పటి కమిషనర్ పమేలా సత్పతిని యాద్రాద్రి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి గ్రేటర్ వరంగల్ కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. హన్మకొండ-వరంగల్ జిల్లాల విభజన జరుగుతున్న ప్రస్తుత కీలక తరుణంలో కమిషనర్ పోస్టును ఖాళీగా ఉంచడం వెనుక రాజకీయ ప్రమేయం ఉందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.
వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియలో గ్రేటర్ ఉన్నతాధికారి ఇన్వాల్వ్‌మెంట్ తప్పనిసరి. భౌగోళిక, సరిహద్దులు, జిల్లా మ్యాపింగ్ వంటి అంశాలపై కమిషనర్ అభిప్రాయం కూడా ఎంతో కీలకం కానుంది. మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న గ్రేటర్ వరంగల్ పరిపాలన అధికారి అభిప్రాయం, సూచనలు ఎంతో ముఖ్యంగా ఉండనున్నాయి. అయితే ఇలాంటి కీలక తరుణంలో కమిషనర్ పోస్టును ఖాళీగా ఉంచడంపై జనాల్లో కూడా అనుమానాలు నెలకొంటున్నాయి.
పనులపై కొరవడుతున్న పర్యవేక్షణ..
జీడబ్ల్యూఎంసీ పరిపాలన పర్యవేక్షించే బాధ్యతలను కలెక్టర్ రాజీవ్‌గాంధీకి తాత్కలికంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తూ ఇన్‌చార్జ్ కమిషనర్ బాధ్యతలను అప్పగించింది. అయితే బిల్లులు, ఇతరత్రా అంశాలపై సంతకాలు చేయాల్సి రావడంతో మూడు రోజుల క్రితం పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగిస్తు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో ఇప్పుడు జీడబ్ల్యూఎంసీకి పూర్తిస్థాయి ఐఏఎస్ అధికారి ఇప్పట్లో రాడా అన్న కొత్త సందేహాలకు తెరలేపుతున్నాయి.
గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అనేక అభివృద్ధి పనులపై పర్యవేక్షణ కొరవడుతోంది. అధికారులకు నిర్ధిష్ఠమైన దిశానిర్దేశం చేసేవారు కరువయ్యారు. ఇటీవల చేపట్టిన నాలాల పూడిక తీత పనులే ఇందుకు నిదర్శనమని పట్టణ ప్రజలు గుర్తు చేస్తున్నారు. పూడికను పూర్తిస్థాయిలో తీయకుండానే కాంట్రాక్టర్లు బిల్లులు కాజేసేందుకు సిద్ధం కావడం ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. పట్టణ ప్రగతి కూడా రాజకీయ హడావుడిగా మారుతోంది. క్షేత్రస్థాయి పరిశీలన లేకపోవడంతో పది రోజుల పండుగలా ముగిసే కార్యక్రమంలా మారుతోందన్న విమర్శలు ఇప్పటికే వినిపిస్తున్నాయి.
ఆ ఇద్దరిలో కమిషనర్‌గా వచ్చేది ఎవరో..
జీడబ్ల్యూఎంసీ కొత్త కమిషనర్‌గా 2015వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ బాదావత్ సంతోష్, జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రవీణారెడ్డిల పేర్లు మొదట్నుంచి వినిపిస్తున్నాయి. అయితే జీడబ్ల్యూఎంసీకి పనిచేసిన కమిషనర్లలో అత్యధికులు మహిళా ఐఏఎస్‌లే. ఈ నేపథ్యంలో మహిళ ఐఏఎస్‌నే నియమించే అవకాశం ఉందని జీడబ్ల్యూఎంసీ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రవీణారెడ్డి ఈనెల 14 తర్వాత కమిషనర్‌గా వస్తారన్న చర్చ కూడా జీడబ్ల్యూఎంసీలో జోరుగా సాగుతోంది.