చెన్నైలో "బీరుట్" తరహా ప్రమాదం?? 

by  |
చెన్నైలో బీరుట్ తరహా ప్రమాదం?? 
X

దిశ, వెబ్ డెస్క్: లెబనాన్ రాజధాని బీరుట్ లో సంభవించిన విస్ఫోటనం కారణంగా 135 మరణించారు. వేలాది మంది గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని ఆవేదనకు గురి చేసింది. ఈ ఘటన ఇప్పుడు తమిళనాడులోని చెన్నై వాసులను భయభ్రాంతుల్ని చేస్తోంది.

తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాలో మనాలి ఇండస్ట్రియల్ ఏరియా. మనాలి గ్రామం చెన్నై సిటీకి ఉత్తరాన ఉంది. ఈ ప్రాంతంలో 2015 నుండి అమ్మోనియం నైట్రేట్ (ammonium nitrate) కి సంబంధించిన నిలువలు ఉన్నాయి. దీంతో మనాలి వాసుల్లో టెన్షన్ మొదలైంది. కాగా దీనిపై కస్టమ్స్ అధికారులు వివరణ ఇచ్చారు. మనాలిలో సుమారు 740 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిలువలు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేసారు. ఇక మద్రాసు హై కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ-వేలం ద్వారా అమ్మోనియం నైట్రేట్ నిలువలను అమ్మేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.



Next Story

Most Viewed