- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంతరిక్షంలో ‘వజ్రాల మంచు’ పడుతుందా?
దిశ, వెబ్‌డెస్క్: చలికాలం రాగానే శీతల ప్రాంతాల్లో మంచు దుప్పటి కమ్ముకుంటుంది. అయితే కేవలం ఒక్క భూమ్మీద మాత్రమేనా.. విశ్వంలో మరెక్కడైనా మంచు పడుతుందా? అనంతమైన పాలపుంతల్లో ఉన్న ఇతర గ్రహాల్లో, ఉపగ్రహాల్లో కూడా ఇలా మంచు కురుస్తుందా? లేదా? ఇప్పటికే ఆయా గ్రహాల మీద ఉన్న రోవర్‌లు అక్కడి మంచును తట్టుకునేలా ఉన్నాయా? అనే ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ దీని గురించి సైంటిఫిక్ ఆధారాలు లేకుండా అంచనాలు వేయడం సబబు కాదు. కాబట్టి ఇప్పటికీ ఇదొకక చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. సాధారణంగా మంచు ఏర్పడటానికి కావాల్సింది ఏంటి.. నీరు. మంచు ఉందంటే నీరు కూడా ఉన్నట్లేనా? నీరు ఉంటే ఆక్సిజన్ కూడా ఉన్నట్లేనా? ఆక్సిజన్ ఉందంటే ఆ గ్రహం మీద మనుషులు బతకడానికి వీలుంటుందా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు తలెత్తుతాయి. మరి ఇలాంటి తరుణంలో విశ్వాంతరాళంలో ఉన్న మంచు గురించి ఆధారాలేమైనా ఉన్నాయేమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
దీని గురించి తెలుసుకునేందుకు మనకు ఒక ఉత్తమ సైంటిఫిక్ రుజువు ఉంది. అంగారక గ్రహం మీదికి పంపించిన ‘క్యూరియాసిటీ రోవర్’ ఈ ప్రశ్నకు ఓ మోస్తరుగా సమాధానం ఇచ్చింది. ఎన్నోసార్లు అంగారక గ్రహం మీద మంచు పడినట్లు క్యూరియాసిటీ పంపిన డేటా ఆధారంగా తేలింది. అక్కడ సరాసరిగా 80 డిగ్రీ ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రత ఏర్పడి, మంచు కురవడానికి అన్ని రకాల అనుకూల పరిస్థితులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా 2008లో నాసా వారు పంపిన ‘ఫీనిక్స్ ల్యాండర్’ కూడా అంగారక గ్రహం ఉత్తర ధ్రువం వద్ద నీళ్లు, మంచు కలగలసిన మంచు ముద్దలు ఉన్న ఫొటోలను కూడా పంపించింది. మరోవైపు అంగారక గ్రహం దక్షిణ ధ్రువం మీద పూర్తిగా గడ్డకట్టిన కార్బన్ డై ఆక్సైడ్ ఉన్నట్లు నాసా వద్ద ఆధారాలు ఉన్నాయి. 2012లో డ్రై ఐస్ ఆకాశం నుంచి పడుతుండటాన్ని శాస్త్రవేత్తలు రికార్డ్ కూడా చేశారు.
అయితే అంగారక గ్రహం మీద మేఘాలు ఉన్నప్పటికీ వాటి నుంచి నీరు మంచులాగ మారి కిందకి పడదు. ఎందుకంటే అక్కడి వాతావరణం చాలా పలుచగా ఉంటుంది. భూమ్మీది వాతావరణంతో పోల్చితే 100 రెట్లు పలుచగా ఉంటుంది. అందుకే ఏదైనా ద్రవరూపంలో ఉన్నది ఆకాశం నుంచి కిందకి పడేలోపే ఆవిరైపోతుంది. అందుకే మేఘాల నుంచి మంచు కిందకి జాలువారినా అది అక్కడి ఉపరితలాన్ని చేరదని శాస్త్రవేత్తలు వివరించారు. భూమ్మీద కొన్ని ప్రాంతాల్లో ఇలాగే జరుగుతుంది. ఈ ప్రక్రియను ‘విర్గా’ అని పిలుస్తారు. కాబట్టి సరైన పరిస్థితులు ఏర్పడినపుడు అంటే గాలి ప్రవాహాలు సమంగా ఉండి, బలమైన చోదకాలు పనిచేసినప్పుడు అంగారక గ్రహ ఉపరితలం మీద మంచు కురవడం సాధ్యమవుతుందని పారిస్‌లో పియరీ అండ్ మేరీ క్యూరీ యూనివర్సిటీకి చెందిన ప్లానెటరీ సైంటిస్ట్ ఐమెరిక్ స్పీగా తెలిపారు.
అంగారక గ్రహం సంగతి సరే.. మరి విశ్వంలో ఉన్న ఇతర గ్రహాల మీద కూడా మంచు కురుస్తుందా? అనే ప్రశ్నకు సమాధానంగా కూడా శాస్త్రవేత్తలు కొన్ని ఆధారాలను ప్రస్తావించారు. 2017 మే నెలలో జూపిటర్ గ్రహం మీద గడ్డకట్టిన కొన్ని మేఘాలు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఇవి అమ్మోనియా, నీటి ద్వారా ఏర్పడిన మేఘాలని, ఇవి ఏర్పడిన తరుణంలో కచ్చితంగా అక్కడ మంచు కురిసి ఉంటుందని వారు చెప్పారు. మరోవైపు శని గ్రహ ఉపగ్రహాల్లో ఒకటైన ఎన్సెలేడర్ మీద ఏకంగా ఐస్ స్కేటింగ్ చేసేంత స్థాయిలో మంచు ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. 2011లో కాసినీ ప్రోబ్ పంపిన డేటా ద్వారా వారికి ఈ విషయం తెలిసింది. ఎన్సెలేడర్ మీద చిన్న చిన్న గీజర్ల నుంచి మంచు కణాలు బయటికి వెదజల్లడాన్ని వారు గమనించారు. అయితే ఈ వెదజల్లే ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని, వంద మీటర్ల మేర మంచు పొర ఏర్పడటానికి దాదాపుగా 10 మిలియన్ల సంవత్సరాలు పడుతుందని వారు వెల్లడించారు. ఇవికాకుండా బాహ్యగ్రహమైన కెప్లర్-13ఏబీ మీద టైటానియం ఆక్సైడ్ మంచు రూపంలో పడుతోందని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాల మీద మంచు వజ్రాల రూపంలో పడుతోందని రుజువులు ఉన్నాయి.