- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఆత్మహత్యలకు కారణం ఇదేనా..?
దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లాలో ఘోరం జరింగింది. ఓ వివాహితతో కలిసి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరి మధ్య ఏ బంధం ఉందో తెలియదు కానీ, వేర్వేరు కుటుంబాలకు చెందిన వీరిద్దరు ప్రాణాలు తీసుకోవడం జిల్లాలో సంచలనంగా మారింది.
వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండలం నాగసాన్‌పల్లి గ్రామానికి చెందిన లావణ్యకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాయిని శ్రీశైలంది కూడా అదే గ్రామం. అతడు వివాహితుడు. వీరిద్దరు వేర్వేరుగా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. వారి కుటుంభీకులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం శ్రీశైలం సొంత పొలంలో వారిద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు షాక్ తిన్నారు. ఘటన స్థలంలో మద్యం సీసాతోపాటు పురుగుల మందు లభించింది. వారిద్దరు కలిసి బైక్‌పై అక్కడకు చేరుకున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. దుప్పట్లు సైతం ఉండడంతో ముందస్తు ప్లాన్ తోనే వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటీ..? ఇద్దరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియక గ్రామస్తులు తలపట్టుకుంటున్నారు. పోలీసులు మాత్రం అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకోని ఉంటారని అనుమానిస్తున్నారు.