తెరవగానే జిమ్‌కు వెళ్లడం కరెక్టేనా?

by  |
తెరవగానే జిమ్‌కు వెళ్లడం కరెక్టేనా?
X

అన్‌లాక్ 3.0లో భాగంగా ఆగస్టు 5వ తేదీ నుంచి జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్లు తెరుచుకోబోతున్నాయి. నాలుగు నెలలకు పైగా మూతపడి ఉన్న ఈ కేంద్రాలన్నీ ఇప్పుడు తెరుచుకోవడానికి సిద్ధమవుతుండగా.. ఇప్పుడు క్లీనింగ్ పెద్ద పనిగా మారింది. దుమ్ము పట్టిన పరికరాలన్నింటినీ ఒక్కొక్కటిగా శుభ్రం చేసి, బకెట్ల కొద్దీ శానిటైజర్‌ను కుమ్మరిస్తున్నారు. మొత్తానికి 5వ తేదీన తెరుచుకున్న తర్వాత ఎంతకాలం నుంచో ఎదురుచూస్తున్న ఫిట్‌నెస్ ప్రియులు క్యూ కడతారా? లేదా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవాళ్లు ఎలాగూ వస్తారనుకోండి. కాబట్టి వారికోసమైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు శుభ్రత, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించడం వంటివి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది.

సాధారణంగా జిమ్‌లకు ఫిట్‌నెస్ మీద ఆసక్తితో వచ్చేవారు ఉంటారు. వారితో పాటుగా డాక్టర్ సూచనల మేరకు ఇంట్లో పరికరాలు లేక వ్యాయామం కోసం జిమ్‌కి వచ్చేవాళ్లు ఉంటారు. వారిలో ఎక్కువ మంది డయాబెటిక్ పేషెంట్లు ఉంటారు. కాబట్టి వారు వీలైనంత వరకు జిమ్‌కు రాకుండా ఉండటమే మంచిది. ఇక మిగతా వాళ్ల కోసం జిమ్ ఎక్విప్‌మెంట్ మధ్య దూరాలను పెంచాలి. అలాగే ప్రతి ఒక్కరి మధ్య సామాజిక దూరం ఉండేలా మార్కింగులు చేయాలి. అయితే తక్కువ వైశాల్యం ఉన్న స్థలాల్లో నిర్మించే ఈ జిమ్స్‌లో ఇలా సామాజిక దూరం పాటించడం సాధ్యమవుతుందా? అనేది పెద్ద విషయం. అంతేకాకుండా ఒకరు ఉపయోగించిన వెంటనే ఎక్విప్‌మెంట్‌ను శానిటైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం వేరే సిబ్బందిని నియమించాలి. అసలే గత నాలుగు నెలలుగా లాభాలు లేక ఇబ్బందుల్లో ఉన్న జిమ్ యాజమాన్యం ఇలాంటి చర్యలు తీసుకోగలుగుతుందా లేదా అనేది కూడా ఒకింత ఆందోళన కలిగిస్తోంది. కాబట్టి ఇన్ని ఆందోళనల మధ్య తెరవగానే జిమ్‌కి వెళ్లకుండా ఆచితూచి అడుగువేయడం మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Next Story