హుజురాబాద్‌లో హరీశ్ రావుకు చెక్ పెట్టింది ఆయనేనా..?

by Anukaran |
హుజురాబాద్‌లో హరీశ్ రావుకు చెక్ పెట్టింది ఆయనేనా..?
X

దిశ, హుజురాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిశ్శబ్ద విజయం సాధించారు ఓటర్లు. టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ పేరున్న మంత్రి హరీష్ రావుకే హుజురాబాద్ ఓటర్లు ట్రబుల్ ఇచ్చారు. బీజేపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైలెన్స్‌గా టీఆర్ఎస్ షాక్ ఇచ్చారు. జితేందర్ రెడ్డి నిశ్శబ్దంగా తన పని తానూ చేసుకుపోగా, హరీష్ రావు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల ఇన్‌చార్జీలతో సమీక్షలు నిర్వహించి సమన్వయం చేశారు. ఓ వైపు పార్టీలో చేరిన వారందరికీ గులాబీ కండువాలు కప్పుతూ మరో వైపు ప్రచారంలో దూకుడు పెంచారు. టీఆర్ఎస్ అభ్యర్థి తానే అన్న చందంగా వ్యవహరించి అసలు అభ్యర్థి గెల్లును ఫోకస్ చేయలేకపోయారు.

పార్టీల్లో చేరికలు, ప్రలోభాలను టీఆర్ఎస్ నమ్ముకొని ఓటర్ల మనోగతాన్ని పసిగట్ట లేకపోయింది. జితేందర్ రెడ్డి సంఘ్ పరివార్, విశ్వ హిందూ పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యారు. ఓటర్లు నిశ్శబ్దంగా ఆలోచిస్తున్నారని, దూకుడుకు దూరంగా ఉన్నారనే విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గ్రహించలేదు. కేసీఆర్, ఈటల రాజేందర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ఫైనల్గా విజయం సాధించింది నిశ్శబ్దమే.

Advertisement

Next Story

Most Viewed