పవన్ దృష్టిలో ఆయన ఫ్లాప్ డైరెక్టరా..?

by  |
పవన్ దృష్టిలో ఆయన ఫ్లాప్ డైరెక్టరా..?
X

దిశ వెబ్‎డెస్క్: కిషోర్ కుమార్ పార్థసాని అలియాస్ డాలీ మంచి దర్శకుడు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నాగచైతన్య, సునీల్‎లతో ‘తడాఖా’ మూవీతో మరో విజయాన్ని పొందాడు. దీంతో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కాంబినేషన్‎లో వచ్చిన ‘గోపాల గోపాల’ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.

బాలీవుడ్ మూవీ ‘ఓ మై గాడ్’కి రీమేక్‎గా వచ్చిన గోపాల గోపాల సినిమాను మల్టీ స్టారర్‎గా రూపొందించాడు డాలీ. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్‎తో బాండింగ్ ఏర్పడడంతో తమిళ్ హిట్ సినిమా ‘వీరమ్’ ని పవన్‎తో ‘కాటమరాయుడు’ గా రీమేక్ చేశాడు. ఈ సినిమా విజయం సాధించలేక పోయింది. కాగా, డాలీ మేకింగ్ పవన్ కళ్యాణ్‎కు నచ్చి హ్యాట్రిక్ మూవీ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ప్రకటించిన ప్రాజెక్టుల్లో డాలీ పేరు లేకపోవడంతో ఫ్లాప్ డైరెక్టర్‎గా భావిస్తుండొచ్చని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


Next Story

Most Viewed