పాలకూరతో ఆ సమస్యలు.. అలా తింటే ముప్పేనా..?

by sudharani |   ( Updated:2021-08-02 10:13:33.0  )
greens
X

దిశ, వెబ్‌డెస్క్ : మనం తీసుకునే ఆహారంపై ఆధారపడే ఆరోగ్యం ఉంటుంది. శరీరంలో ఏ పార్ట్ చెడిపోయినా.. దానికి ప్రధాన కారణం మనం నిత్యం తీసుకునే పదార్థాలే కారణం. అయితే చాలామంది ఉదయం వండిన అన్నం, కూరలను ఫ్రిజ్‌లో భద్రపర్చుకుని రాత్రికి, రాత్రి వండినవి ఉదయం వేడి చేసుకుని తింటుంటారు. ఇలా తినడం వల్ల ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆకు కూరలతో ఆరోగ్యం చెడిపోతుందని హెచ్చరిస్తున్నారు.

పచ్చని ఆకు కూరలు, పాలకూరలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. అయితే ఈ ఆకు కూరలను వేడివేడిగా తినడం మేలట. చల్లారిన, ఫ్రిజ్‌లో పెట్టి, మళ్లీ వేడిచేయడం వల్ల ఆకు కూరల్లో ఉండే ఆక్సైడ్ విడుదల అవుతుంది. అది ఐరన్ ఆక్సీకరణగా మారి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. మిగిలిన అన్నం వేడిచేసుకుని తింటే ఫుడ్ పాయిజన్ అవుతుందని పేర్కొంటున్నారు.

eggs

కోడి గుడ్లను ఇలా తింటే డేంజరే..

కోడి గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దానిని తినే విధానంలో తేడా వస్తే ఆ ప్రభావం ఆరోగ్యంపై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుడ్డును ఉడకపెట్టిన రెండు గంటల లోపు తినాలని సూచిస్తున్నారు. కానీ కొంతమంది ఉడకపెట్టిన గుడ్లను ఫ్రిజుల్లో రోజుల తరబడి దాచుకుని వేడి చేసుకుని తింటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికెన్‌ను కూడా ఇలా చేస్తూ చక్కని ఆరోగ్యాన్ని ఆస్పత్రుల పాలు చేసుకుంటున్నారని వాపోతున్నారు. ఈ కరోనా సమయంలో మరింత జాగ్రత్తగా ఉండి వేడివేడి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed