ఐష్ లాగే ఆరాధ్య.. నెం.1 హీరోయిన్?

by Shyam |
ఐష్ లాగే ఆరాధ్య.. నెం.1 హీరోయిన్?
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మనం అభిమానించే నటుల గురించి తెలుసుకునేందుకు చాలా ఉత్సాహం చూపిస్తుంటాం. వారి పర్సనల్ లైఫ్ గురించి మరింత ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఆ నటుల వారసత్వం గురించి ఏదో తెలియని ఇంట్రెస్ట్.. వాళ్లు ఏం చేస్తున్నారు? ఏం నేర్చుకుంటున్నారు? ఫ్యూచర్‌లో ఏం చేస్తారు? పెద్దయ్యాక సినిమాల్లోకి వస్తారా? లేక బిజినెస్ అంటారా? అంటూ చర్చించుకుంటాం. ఇప్పుడు ఒక సెలబ్రిటీ కిడ్‌పైనా అదే చర్చ జరుగుతోంది.

అందాల రాశి, నీలికళ్ల సుందరి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌ల కూతురు.. బిగ్ బి అమితాబ్ బచ్చన్, జయల మనవరాలు ఆరాధ్య బచ్చన్ గురించే నెట్టింట డిస్కషన్ స్టార్ట్ అయింది. కాగా, దీనిపై స్పందించిన బెంగళూరుకు చెందిన పాపులర్ ఆస్ట్రాలజర్, ఫేస్ రీడర్ పండిట్ జగన్నాథ్ గురూజీ ఆరాధ్య లైఫ్ అద్భుతంగా ఉండబోతుందని చెప్పాడు. ఎనిమిదేళ్ల వయసున్న ఆరాధ్య విదేశాల్లో గొప్ప చదువులు చదివి మంచి పేరు తెచ్చుకుంటుందని.. కానీ తాత, నానమ్మ, తల్లిదండ్రుల మాదిరిగానే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు ఇండియాకు తిరిగొస్తుందని చెప్పాడు. 20-23 ఏళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేసి అద్భుతంగా రాణిస్తుందని ఆరాధ్య భవిష్యత్ గురించి వివరించాడు.

Advertisement

Next Story

Most Viewed