కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలి : రజత్ కుమార్

by Shyam |
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలి : రజత్ కుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ స్పందించారు. నోటిఫికేషన్‌పై అధ్యయనం కొనసాగుతోందని తెలిపారు. పాలన, సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై కసరత్తు జరుగుతోందని వివరణ ఇచ్చారు. నూతన రాష్ట్రమైన తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయపరమైన వాటా తేల్చాలన్నారు. తెలంగాణ వాటా తేల్చే వరకు ఈ ఏడాది 811 టీఎంసీల్లో సగం కేటాయించాలని చెప్పారు. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమేనని తెలిపారు. దేవాదుల, పాలమూరు-రంగారెడ్డి, డిండి తదితర ప్రాజెక్టులన్నీ పాతవేనని కేంద్రానికి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed