ఐర్లాండ్ లక్ష్యం 329

by Shiva |
ఐర్లాండ్ లక్ష్యం 329
X

– సెంచరీతో చెలరేగిన ఇంగ్లాండ్ కెప్టెన్

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్-ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌ ఇప్పటికే ఫలితం తేలిపోయింది. ఇంగ్లాండ్ జట్టు సిరీస్ విజయం సాధించడంతో చివరి మ్యాచ్ నామమాత్రంగా మారిపోయింది. కాగా, సౌతాంప్టన్‌లో జరుగుతున్న మూడే వన్డేలో ఇంగ్లాండ్ జట్టు ఐర్లాండ్‌కు 329 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. టాస్ గెలిచిన ఐర్లాండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గన్ చెలరేగి 84 బంతుల్లో 106 పరుగులు చేయడం విశేషం. మోర్గాన్, బాంటన్‌లు కలిసి నాలుగో వికెట్‌కు 156 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. మోర్గాన్ అవుటయ్యాక ఇంగ్లాండ్ జట్టు స్వల్ప స్కోర్‌కే మూడు వికెట్లు కోల్పోయింది. ఎనిమిదో వికెట్‌కు డేవిడ్ విల్లే (51), టామ్ కరన్ (38)తో కలిసి 73పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు వైపు దూసుకెళ్లింది. చివరకు పూర్తి ఓవర్లు ఆడకుండానే 49.5 ఓవర్ల వద్ద ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ అయ్యింది.

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఓవర్‌లోనే జాసన్ రాయ్ (1) వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న బారిస్ట్రో (4), విన్సీ(16) కూడా త్వరగానే అవుటయ్యాడు. దీంతో కడపటి వార్తలు అందేసమయానికి ఇంగ్లాండ్ జట్టు 44 పరుగుల వద్ద 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది.

స్కోర్ బోర్డ్:
ఇంగ్లాండ్ బ్యాటింగ్
జేసన్ రాయ్ 1, బారిస్ట్రో 4, విన్సీ 16, ఇయాన్ మోర్గాన్ 106, బాంటన్ 58, సామ్ బిల్లింగ్స్ 19, మొయిన్ అలీ 1, డేవిడ్ విల్లే 51, టామ్ కరన్ 38 నాటౌట్, ఆదిల్ రషీద్ 3, మహమూద్ 12. ఎక్స్‌ట్రాలు (19), మొత్తం 328/10

వికెట్ల పతనం 1-2, 2-14, 3-44, 4-190, 5-202, 6-203, 7-216, 8-289, 9-298, 10-328

ఐర్లాండ్ బౌలింగ్
యంగ్ (10-1-53-3), ఆదిర్ (7-0-45-1), లిటిల్ జూనియర్ (8.5-0.62-2), కాంఫర్ (10-1-68-2), బ్రైన్ (8-0-61-0), డెలానీ (6-0-29-1)

Advertisement

Next Story

Most Viewed