- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వాటి పరిష్కారానికి పారదర్శకత అవసరం
by Harish |

X
దిశ, వెబ్‌డెస్క్: బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ అన్ని బీమా సంస్థలను పాలసీదారులకు సంబంధించిన ఆరోగ్య బీమా పరిష్కార ప్రక్రియలో మరింత పారదర్శకంగా ఉండాలని కోరింది. అలాగే, పాలసీ తిరస్కరణ సమయంలో పాలసీదారులకు సరైన కారణాలను వెల్లడించాలని తెలిపింది. క్లెయిమ్ ప్రక్రియ జరిగే వివిధ దశల్లో పాలసీదారులకు స్పష్టమైన, పారదర్శకమైన సమాచారన్ని అందించేందుకు బీమా సంస్థలు విధివిధానాలను ఏర్పాటు చేయడం చాలా అవసరమని ఐఆర్‌డీఏఐ ఓ ప్రకటనలో పేర్కొంది. పాలసీదారులు వైబ్‌సైట్/పోర్టల్/యాప్‌ల నుంచి లేదా ఏదైనా ఇతర మార్గాల ద్వారా బీమా సంస్థలకు చేసిన క్లెయిమ్‌ల స్టేటస్‌ను ట్రాక్ చేసేందుకు అన్ని బీమా కంపెనీలు సరైన వ్యవస్థలను నిర్వహించాలని కోరింది. క్లెయిమ్‌లను పరిష్కరించే సమయంలో దాని స్టేటస్‌ను ట్రాక్ చేసేందుకు పాలసీదారులకు అన్ని రకాలుగా సమాచారాన్ని అందించాలని స్పష్టం చేసింది.
Next Story