Good news : పోస్టాఫీసు కస్టమర్లకు శుభవార్త చెప్పిన HDFC బ్యాంక్.. వారందరికీ చౌకగా గృహరుణాలు..!

by Anukaran |
Good news : పోస్టాఫీసు కస్టమర్లకు శుభవార్త చెప్పిన HDFC బ్యాంక్.. వారందరికీ చౌకగా గృహరుణాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ తమ సేవలను మరింత విస్తరించేందుకు రంగం సిద్ధం చేసింది. తమ వ్యాపార, సేవా కార్యక్రమాల్లో్ భాగంగా తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంక్‌ (IPPB)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ వినియోగదారులకు దేశవ్యాప్తంగా ఉత్తమ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ విభాగంలో ఒకప్పుడు టాప్ పొజిషన్‌లో ఉన్న ICICI బ్యాంక్‌ను వెనక్కి నెట్టి HDFC నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే కాదు.. ఇప్పటికీ తమ సేవలను విస్తరించుకుంటూ ఆ స్థానాన్ని పదిలం చేసుకుంది.

HDFC బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదిరిన సందర్భంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తమ వినియోగదారులకు పండుగ వేళ గుడ్‌న్యూస్ చెప్పింది. దిగ్గజ ఫైనాన్సింగ్ కంపెనీతో టై అప్ అయిన సందర్భంగా IPPB కస్టమర్లకు HDFC ద్వారా గృహ రుణాలు ఇకపై చౌకగా, సులువుగా లభించనున్నాయి. ఐపీపీబీకి దేశవ్యాప్తంగా 650కు పైగా బ్రాంచులు.. 1,36,000 బ్యాంకింగ్ సేవలందించే పోస్టాఫీస్‌లను కలిగి ఉన్నది. అంతేకాకుండా దీనికి దేశవ్యాప్తంగా 4.7 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు.

ఈ ఖాతాదారులందరికీ సులువుగా హోమ్ లోన్స్ అందుబాటులోకి రానున్నాయి. గ్రామాల్లోని కస్టమర్లు కూడా ఈ రుణాలను పొందవచ్చని తెలిపింది. ఈ లోన్స్ అనేవి హెచ్‌డీఎస్‌ఫీ శాఖల ద్వారానే కాకుండా IPPB పోస్టాఫీస్‌ల ద్వారా (పోస్ట్‌మెన్ అండ్ గ్రామీణ్ డక్ సేవక్స్) కూడా గృహరుణాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తన కస్టమర్లకు చెందిన లోన్ ప్రాసెస్ వంటి అంశాలను హెచ్‌డీఎఫ్‌సీ చూసుకుంటుందని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed