- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోహిత్ శర్మను సెల్ఫిష్ అంటే ఒప్పుకోం
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-14 లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. చివరి వరకు రోహిత్ శర్మ క్రీజులో ఉన్నా.. ధోని తన మాస్టర్ మైండ్‌తో ప్లాన్ చేసి చివరికి 20 పరుగుల తేడాతో జట్టును గెలిపించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేశారు. 63 బంతుల్లో 105 పరుగులు చేసి చివరి వరకూ పోరాడారు. అయినా ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మపై ట్రోల్స్ మొదలయ్యాయి. సెంచరీ కోసమే రోహిత్ మెల్లగా ఆడారని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో విమర్శిస్తున్న నెటిజన్లకు రోహిత్ ఫ్యాన్స్ కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చారు. రోహిత్‌ను సెల్ఫిష్ అంటే ఒప్పుకోం అని.. వరుసగా వికెట్లు పడుతున్నా భయం లేకుండా ఒక్కడే నిలబడ్డాడు. మిగతా ప్లేయర్ల నుంచి అతనికి సహకారం కూడా అందలేదు. చివర్లో రోహిత్‌కు స్ట్రైకింగ్ కూడా అంతగా రాలేదు. అందుకు అతనేం చేస్తాడు అని ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చారు.