IPL 2023 Final : పీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా..జరగదా? వాతావరణ శాఖ కీలక అప్డేట్

by Satheesh |   ( Updated:2023-05-29 12:50:54.0  )
IPL 2023 Final  : పీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా..జరగదా? వాతావరణ శాఖ కీలక అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తోన్న క్రికెట్ అభిమానులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ గుజరాత్‌లోని అహ్మదాబాద్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి లేదని వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. అహ్మదాబాద్‌లో ప్రస్తుతం పొడి వాతావరణం ఉందని తెలిపింది.

అహ్మదాబాద్‌లో ఇవాళ వర్షం పడే అవకాశం కేవలం ఐదు శాతం మాత్రమే ఉందని వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్ ఫైనల్ పోరుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇక, మే 28వ తేదీనే గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా నిర్వహకులు మ్యాచును రద్దు చేశారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే వెసులు బాటు ఉండటంతో మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేశారు. దీంతో ఇవాళ రాత్రి 7.30 గంటలకు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టైటిల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed