IPL 2024 క్వాలిఫైయర్ 1 KKR vs SRH వర్షం పడే అవకాశం ఉందా..?

by Mahesh |   ( Updated:2024-05-21 04:08:10.0  )
IPL 2024 క్వాలిఫైయర్ 1 KKR vs SRH వర్షం పడే అవకాశం ఉందా..?
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024 లో కీలక ఘట్టానికి ఒక అడుగు దూరంలో ఉంది. లీగ్ స్టేజ్ మ్యాచులు పుర్తవ్యవగా ప్లే ఆఫ్ క్వాలిఫై అయిన కేకేఆర్, సన్రైజర్స్, రాజస్థాన్, బెంగళూరు జట్లు క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ 1 లో తలపడనున్నాయి. ఇందులో ఈ రోజు మే 21 మంగళవారం నరేంద్ర మోడీ స్టేడియంలో క్వాలిఫైయర్ 1 లో కలకత్తా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఇదిలా ఉంటే గత వారం రోజులుగా దేశంలోని ప్రధాన నగరాల్లో కురుస్తున్న అకాల వర్షాలకు పలు కీలక మ్యాచులు రద్దు అయ్యాయి. దీంతో ప్లే ఆఫ్ పై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. తాజాగా క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ 1 మ్యాచుల సమయంలో వర్షం పడితే ఎలా అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ క్రమంలోనే బీసీసీఐ ఈ మ్యాచుల కోసం 60 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది.

అలాగే ఈ రోజు అహ్మదాబాద్ లో జరిగే మ్యాచ్ సమయంలో ఎటువంటి వర్షం పడే అవకాశం లేదని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉష్ణోగ్రత 45-46 డిగ్రీల వరకు పెరిగాయని.. సాయంత్రం మ్యాచ్ సమయంలో కూడా, ఉష్ణోగ్రత 41-44 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో క్రికెట్ అభిమానులు పండగ చేసుకొనున్నారు. ఈ సీజన్ లో ఇరు జట్లు విస్పోటన కరమైన బ్యాటింగ్ తో తమ అభిమానులకు పండుగ అందిస్తున్నారు. కాగా ఈ ఒక్క మ్యాచ్ లో గెలిస్తే డైరెక్ట్ ఫైనల్ వెళ్తారు కాబట్టి.. ఈ మ్యాచులో కూడా ఇరు జట్లు తమ సత్తా ఏంటో చాటేందుకు ప్రయత్నిస్తారు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచి ఐపీఎల్ 2024 ఫైనల్ చేరుకుంటారో తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story