- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL-2024: ఆందోళనలో ముంబై ఇండియన్స్ జట్టు.. సీజన్ మొత్తానికి ఆ ప్లేయర్ దూరం, ఎందుకో తెలిస్తే షాకే!
దిశ, వెబ్‌డెస్క్: IPL-2024 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ వరుసగా పరాజయాల బాట పట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ మార్పుతో ఆ ఫ్రాంచైజీని ఆది నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. మంచి విన్నింగ్ స్ట్రీక్ ఉన్న రోహిత్‌ను కాదని హార్దిక్ ప్యాండను సారథిగా నియమించాన్ని ఆ జట్టు ఫ్యాన్, జట్టులోకి ఆటగాళ్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు టాపార్డర్ భారీ స్కోరు నమోదు చేసినప్పటికీ పేలవ బౌలింగ్‌తో స్కోర్లను కాపాడుకోలేక ముంబై జట్టు బొక్కబోర్ల పడుతోంది. అదేవిధంగా డ్రైస్సింగ్ రూంలో హర్దిక్ పాండ్యా కూడా తీరు వివాదాలకు తావిస్తోంది.
బౌలింగ్ కోచ్ లసిత్ మలింగాను అమానించడం పట్ల జట్టులో తోటి ఆటగాళ్లు, స్టాఫ్ కోచ్‌లు హార్దిక్‌పై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో ముంబై జట్టుకు మరో షాక్ తగిలింది. సౌతాఫ్రికా పేస్ బౌలర్ క్వేనా మఫాకా సీజన్ మొత్తానికి దూరం కాబోతున్నాడు. ప్రస్తుతం అతడు పదో తరగతి చుదువుతుండటంతో పరీక్షల నేపథ్యంలో సొంత దేశానికి పయనమమ్యాడు. ఈ పరిణామంతో ముంబై జట్టు బౌలింగ్ విభాగం మరింత బలహీనం కానుంది. ఇప్పటికే 4 మ్యాచ్‌లు ఆడి మూడింట్లో పరాజయాన్ని చవిచూసిన ముంబై జట్టు ఇకనైనా తేరుకుని విజయాల బాటపట్టాలి. లేకపోతే ఏకంగా టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితులు వస్తాయని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.