IPL 2023: కైల్‌ మేయర్స్‌ హాఫ్ సెంచరీ.. రాజస్తాన్ టార్గెట్ ఇదే

by Vinod kumar |   ( Updated:2023-04-23 12:54:44.0  )
IPL 2023: కైల్‌ మేయర్స్‌ హాఫ్ సెంచరీ.. రాజస్తాన్ టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలకు 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ (51; 42 బంతుల్లో 4x4, 3x6) ఈ సీజన్లో మూడో హాఫ్ సెంచరీ కొట్టాడు. కేఎల్‌ రాహుల్‌ (39; 32 బంతుల్లో 4x4, 1x6) పరుగులు చేయగా.. ఆఖర్లో నికోలస్‌ పూరన్‌ (29; 20 బంతుల్లో 2x4, 1x6) మెరుపు షాట్లు బాదేశాడు. రాజస్తాన్ రాయల్స్‌ బౌలర్‌లో.. రవిచంద్రన్‌ అశ్విన్‌ 2, బోల్ట్, సందీప్ శర్మ, హోల్డర్ తలో వికెట్ తీశారు.

Advertisement

Next Story