IPL 2023: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్..

by Vinod kumar |   ( Updated:2023-04-25 13:48:07.0  )
IPL 2023: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐదుసార్లు ఐపీఎల్ గెలిచిన ముంబై ఇండియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య కీలకమైన పోరు జరగనుంది. ఈ రెండు టీమ్స్ చివరి మ్యాచుల్లో అనూహ్యమైన ఫలితాలు పొందాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ కావాలి.

ఇప్పుడిప్పుడే విజయాల బాట పడుతన్న ముంబై కూడా తమ టీంను ఎలాగైనా ప్లేఆఫ్స్ తీసుకెళ్లాలని కలలు కంటోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టేబుల్‌లో పైకి వెళ్లాలని హిట్‌మ్యాన్‌ సేన పట్టుదలగా ఉండగా.. ఐదో విజయం అందుకోవాలని గుజరాత్ టైటాన్స్‌ ఉవ్విళ్లూరుతోంది. జోఫ్రా ఆర్చర్ సహా ముంబై బౌలింగ్ యూనిట్ అంత గొప్పగా లేదు. పీయూష్ చావ్లా మాత్రమే ప్రభావం చూపుతున్నాడు.

ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌లాడిన ముంబయి ఇండియన్స్‌ ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. హ్యాట్రిక్‌ విజయాలు అందుకోవడం వారిలో జోష్‌ పెంచింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడుతున్నారు. వికెట్‌ పోయినా సరే దూకుడుగా సిక్సర్లు బాదేస్తున్నారు. తిలక్‌ వర్మ మిడిలార్డర్‌లో విలువైన రోల్‌ ప్లే చేస్తున్నాడు.

ముంబై ఇండియన్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ (సి), ఇషాన్ కిషన్ (WK), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, జాసన్ బెహ్రెండోర్ఫ్, రిలే మెరెడిత్.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

వృద్ధిమాన్ సాహా (WK), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (C), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ.

Advertisement

Next Story