IPL 2023: ఐదో వికెట్ కోల్పోయిన లక్నో..

by Vinod kumar |   ( Updated:2023-05-04 13:57:07.0  )
IPL 2023: ఐదో వికెట్ కోల్పోయిన లక్నో..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌‌ 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో మేయర్స్‌(14) తొలి వికెట్‌గా ఔట్ కాగా.. మహీశ్‌ తీక్షణ బౌలింగ్‌లో లక్నో ఓపెనర్‌ మనన్‌ వోహ్రాను బౌల్డ్ అయ్యాడు. లక్నో కెప్టెన్ కృనాల్‌ పాండ్యా తీక్షణ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌‌గా పెవిలియన్‌కు చేరాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయిన స్టొయినిస్‌ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ప్రస్తుతం లక్నో స్కోరు 15 ఓవర్లకు 71 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (16), ఆయుష్ బడోని (18) రన్స్‌తో క్రీజులో ఉన్నారు.

Advertisement

Next Story