IPL 2023: శిఖర్ ధావన్ సూపర్ ఇన్నింగ్స్.. SRH టార్గెట్ ఇదే

by Vinod kumar |   ( Updated:2023-04-09 16:31:39.0  )
IPL 2023: శిఖర్ ధావన్ సూపర్ ఇన్నింగ్స్.. SRH టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు విజృంభించారు. కెప్టెన్ శిఖర్ ధావన్ (66 బంతుల్లో 99 నాటౌట్) అద్భుత పోరాటంతో పంజాబ్ కింగ్స్ గౌరవప్రద స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఓ దశలో సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి 88 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌గా బరిలో దిగిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఓవైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం సాగించాడు. చివరి బ్యాట్స్ మన్ మోహిత్ రాధీనితో ధావన్ ఆఖరి ఐదు ఓవర్లలో హిట్టింగ్‌కు తెరలేపాడు. దాంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. ధావన్, రాధీ 31 బంతుల్లో 55 పరుగులు జోడించారు.

ఐపీఎల్ చరిత్రలో 10వ వికెట్‌కు ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం. ధావన్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. అతడి స్కోరులో 12 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. పంజాబ్ ఇన్నింగ్స్‌లో శామ్ కరన్ 15 బంతుల్లో 22 పరుగులు చేయగా.. మిగతా బ్యాట్స్ మెన్ దారుణంగా విఫలమయ్యారు. సన్ రైజర్స్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే 4 వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ 2, ఉమ్రాన్ మాలిక్ 2, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీశారు.

Advertisement

Next Story

Most Viewed