IPL 2023: ఆ ఇద్దరికి టీమ్ ఇండియాకు ఆడే అవకాశం ఇవ్వండి : హర్భజన్ సింగ్

by Vinod kumar |   ( Updated:2023-05-17 10:10:41.0  )
IPL 2023: ఆ ఇద్దరికి టీమ్ ఇండియాకు ఆడే అవకాశం ఇవ్వండి : హర్భజన్ సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో ఇద్దరు యువ క్రికెటర్లు కేకేఆర్‌ నుంచి రింకూ సింగ్‌, రాజస్థాన్‌ రాయల్స్ నుంచి యశస్వి జైస్వాల్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ వీరిద్దరికి టీమ్ ఇండియాకు ఆడే అవకాశం ఇవ్వాలన్ని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అయితే నేరుగా ఫైనల్‌ ఎలెవెన్‌లో (టీమిండియా) ఆడించాలని కోరడం లేదని.. జట్టుకు దగ్గరగా తీసుకెళ్లాలన్నదే తన ఉద్దేశ్యమన్నాడు. ప్రస్తుతం వారిద్దరూ ఉన్న ఫామ్‌లో టీమ్ ఇండియా జట్టులో ఆడే అవకాశం కలిపిస్తే సత్తా చాటుతారని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో సెలెక్టర్లు వేచి చూసే ధోరణిని అవలంభిస్తే, అది వారితో పాటు టీమ్ ఇండియాకు కూడా నష్టం అవుతున్నదన్నారు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లను ఆడిన జైస్వాల్.. 575 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 166.18 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్‌తో స్టేడియంలో పరుగుల వరదను పారిస్తోన్నాడీ లెఫ్ట్ హ్యాండర్. 2020లో ఐపీఎల్‌లో అడుగు పెట్టిన ఈ యంగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ అతి తక్కువ సమయంలో 1,000 పరుగుల ల్యాండ్ మార్క్‌ను అందుకున్నాడు. 36 మ్యాచ్‌లల్లో 1,122 పరుగులు చేశాడు. అలాగే మరో ప్లేయర్ కేకేఆర్ జట్టు నుంచి రింకూ సింగ్ కూడా ఈ సీజన్ ఐపీఎల్‌లో సత్తా చాటాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లను ఆడిన రింకూ సింగ్.. 507 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 143.31. ఈ సీజన్‌లో వారిద్దరూ నిలకడగా రాణిస్తోండటం బోనస్. వికెట్ పడకుండా క్రీజ్‌లో శరవేగంగా పాతుకునిపోవడం, ఎలాంటి బౌలరైనా ధీటుగా ఎదుర్కొనడం అతని ప్రత్యేకత.

సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, సంజు శాంసన్, ధృవ్ జురెల్, ఆయుష్ బదోని, కర్ణ్ శర్మ, రాహుల్ తెవాతియా.. ఇలా యంగ్ ప్లేయర్లందరూ సత్తా చాటుతున్నారు. జాతీయ జట్టులో తలుపు తడుతున్నారు. ఐపీఎల్ ద్వారా లభించిన అవకాశాలను వారంతా సద్వినియోగం చేసుకుంటోన్నారు. గతంలో సూర్యకుమార్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, హార్ధిక్‌ పాండ్యా, జస్ప్రీత్‌ బుమ్రా లాంటి స్టార్లు సైతం ఇదే వేదికగా వెలుగులోకి వచ్చి నేడు టీమిండియాలో సుస్థిర స్థానాలు సంపాదించుకున్నారు..

Also Read..

10 రోజులుగా నా తండ్రి ICUలో ఉన్నాడు.. అతని కోసమే నేను ఆ గేమ్ ఆడుతున్నాను: Mohsin Khan

Advertisement

Next Story