- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఉర్రూతలూగుతున్న ఉప్పల్ స్టేడియం.. దంచికొడుతున్న ఓపెనర్లు హెడ్, అభిషేక్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2024 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జాయింట్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనంతరం లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు, ప్యాట్ కమిన్స్ 1 వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ దిగిన ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా హెడ్ దొరికిన బంతిని దొరికినట్లుగా ఊచకోత కోశాడు. గౌతమ్ కృష్ణప్ప వేసిన రెండో ఓవర్‌లో ఏకంగా 3 సిక్స్‌లు 1 ఫోర్లు బాది ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. మరో ఎండో ఉన్న అభిషేక్ శర్మ చూడచక్కని షాట్లతో స్కోర్ బోర్టు జెట్ స్పీడ్‌తో పరుగులు పెట్టేలా బ్యాటింగ్ చేస్తున్నాడు. 7 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ జట్టు వికెట్ కోల్పోకుండా 126 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 27 బంతుల్లో 85 పరగులు, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63 పరగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు.