- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐపీఎల్ ఫైనల్ తేదీలో మార్పు?
దిశ, స్పోర్ట్స్: మార్చి 29నే జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కరోనా నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. తిరిగి సెప్టెంబర్ 19నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్ ఫైనల్ నవంబర్ 8న జరగనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఈ తేదీలను ప్రాథమికంగా ప్రకటించినా, పూర్తిస్థాయి షెడ్యూల్ మాత్రం ఆగస్టు 2న జరిగే జీసీ సమావేశం అనంతరం ప్రకటించనున్నారు. కాగా, బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా ఐపీఎల్ ఫైనల్ తేదీని మార్చాలని పట్టుబడుతున్నది. దీపావళి రోజైన నవంబర్ 14వరకు కాకపోయినా కనీసం 10వ తేదీ వరకైనా లీగ్‌ను పొడిగించాలని కోరతున్నది. దీపావళి వారంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తే వ్యూవర్‌షిప్ పెరుగుతుందని స్టార్ అంచనా వేస్తున్నది. ఒకవేళ ఫైనల్ నవంబర్ 10న నిర్వహిస్తే, ఐపీఎల్ చరిత్రలోనే వీకెండ్ రోజున కాకుండా వారం మధ్యలో జరిగిన ఫైనల్‌గా రికార్డులకెక్కనుంది. అయితే, ఫైనల్ తేదీని వెనక్కు జరపడం వల్ల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీం ఇండియా జట్టు నేరుగా యూఏఈ నుంచే ఆసీస్ వెళ్లాల్సి వస్తుంది. ఐపీఎల్‌లో బయో బబుల్ వాతావరణంలో ఆటగాళ్లు ఉంటారు కాబట్టి అక్కడి నుంచే తమ దేశానికి రావాలని ఆస్ట్రేలియా బోర్డు కూడా పట్టుబడుతున్నది. ఫైనల్ మ్యాచ్ కంటే ముందే చాలా మంది టీం ఇండియా ఆటగాళ్ల మ్యాచ్‌లు ముగిసే అవకాశం ఉంది. కానీ వాళ్లు ఫైనల్ అయ్యే వరకు యూఏఈలోనే ఉండి మిగతా ఆటగాళ్లతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లనున్నట్లు సమాచారం.