- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మళ్లీ అక్కడే ఐపీఎల్.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కీలక మార్పులు
దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్తను అందించబోతున్నది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఉన్న సమయాన్ని వినియోగించుకోవాలని బీసీసీఐ భావిస్తున్నది. గత ఏడాది యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020ని విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో మరోసారి అక్కడే మిగిలిన మ్యాచ్‌లు పూర్తి చేయడానికి బీసీసీఐ సిద్దపడుతున్నది. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో ఈ మేరకు సంప్రదింపులు జరిపిందని.. ఆ తేదీల్లో ఐపీఎల్ నిర్వహణకు అంగీకరం తెలపినట్లు ఒక ఆంగ్ల దినపత్రిక కథనాన్ని వెలువరించింది. ఈ నెల 29న బీసీసీఐ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. వాయిదా పడిన ఐపీఎల్ నిర్వహణే మెయిన్ ఎజెండాగా ఉన్నది. అపెక్స్ కమిటీలో ఐపీఎల్ తేదీలు, ఆటగాళ్ల అందుబాటు, యూఏఈలో మైదానాల అందుబాటు, లాజిస్టిక్స్ తదితర వివరాలను చర్చించబోతున్నారు. సమావేశం అయిన వెంటనే లేదా ఆ మరుసటి రోజు ఐపీఎల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బీసీసీఐ ప్రకటించనున్నది.
టెస్టు సిరీస్ షెడ్యూల్ మార్పు?
టీమ్ ఇండియా జూన్ 2న ఇంగ్లాంగ్ బయలు దేరి వెళ్లనున్నది. ఈ పర్యటనలో జూన్ 18 నుంచి 22 వరకు న్యూజీలాండ్‌తో వరల్డ్ టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లాండ్‌లో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనున్నది. దీంతో సెప్టెంబర్ 15 నుంచి ఐపీఎల్ ఆడటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అప్పటికే బయోబబుల్‌లో ఉండే ఇంగ్లాండ్, ఇండియా ఆటగాళ్లు యూఏఈ వచ్చి నేరుగా తమ ఫ్రాంచైజీల బయోబబుల్‌లో చేరవచ్చు. ఇంగ్లాండ్ నుంచి కేవలం గంటల వ్యవధిలో యూఏఈ చేరుకునే అవకాశం ఉన్నది. ఇక సెప్టెంబర్ 15 నుంచి 30 రోజుల పాటు 31 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ నెల రోజుల వ్యవధిలో నాలుగు శని, ఆది వారాలు వస్తాయి. ఆయా రోజుల్లో డబుల్ హెడర్ మ్యాచ్‌లు నిర్వహిస్తే 8 రోజుల్లో 16 మ్యాచ్‌లు పూర్తవుతాయి. మిగిలిన 15 మ్యాచ్‌ల కోసం 22 రోజులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఐపీఎల్ నిర్వహించవచ్చని బీసీసీఐ భావిస్తున్నది.
అయితే ఇండియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్ ముగిసిన వెంటనే ఆదరాబాదరాగా రాకుండా వారికి కొంచెం సమయం కావాలంటే షెడ్యూల్ అడ్జెస్ట్ చేస్తే బాగుంటుందని బీసీసీఐ ఆలోచిస్తున్నది. అగస్టు 12 నుంచి 16 వరకు రెండు టెస్ట్ జరుగనున్నది. అయితే ఆ తర్వాత మూడో టెస్టు కు 9 రోజుల గ్యాప్ ఉన్నది. దీన్ని 5 రోజులకు తగ్గించి షెడ్యూల్‌ను మారిస్తే సెప్టెంబర్ 11 కల్లా సిరీస్ ముగించే అవకాశం ఉన్నది. దీంతో ఐపీఎల్ ప్రారంభానికి 4 రోజుల గ్యాప్ లభిస్తుందని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో చర్చలు జరపాలని బోర్డు నిర్ణయించింది. ఈసీబీ కనుక షెడ్యూల్ మార్చడానికి అనుకూలంగా ఉంటే ఐపీఎల్‌కు మరింత సమయం లభించే అవకాశం ఉంటుంది.
గమనిస్తున్న ఐసీసీ..
ఇప్పటికే ఆసియా కప్ వాయిదా వేస్తూ ఏసీసీ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఆ విండోలో ఆసియా కప్ అడ్డుపడే అవకాశం లేదు. ఇక ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఇండియాలో అక్టోబర్ 18న ప్రారంభం కావల్సి ఉన్నది. కరోనా కారణంగా టీ20 వరల్డ్ కప్ కూడా తరలిస్తారనే వార్తలు వినిపించాయి. కానీ ఐసీసీ ఇప్పటికీ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు బీసీసీఐ టీ20 వరల్డ్ కప్‌ను ఇండియాలోనే నిర్వహిస్తామని చెబుతున్నది. దీనిపై కూడా మే 29నే నిర్ణయం తీసుకోనున్నారు. బీసీసీఐ తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఐసీసీ నిర్ణయం ఉంటుంది. మే 29 ప్రత్యేక సమావేశంలో బీసీసీఐ రెండు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నది. ఐపీఎల్ తేదీలను కన్ఫార్మ్ చేయడంతో పాటు ఇండియాలోనే టీ20 వరల్డ్ కప్ నిర్వహించే విషయంలో స్పష్టత ఇవ్వాలి. దీన్ని బట్టే ఐసీసీ నిర్ణయం కూడా ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని.. ఐపీఎల్ మిగిలిన టోర్నీ నిర్వహించడానికి బీసీసీఐ తీసుకున్న విండో ఎవరికీ ఆటంకం లేకుంటే మాకు కూడా అభ్యంతరం ఉండదని ఒక ఐసీసీ అధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు యూఏఈ క్రికెట్ బోర్డు కూడా అంగీకారం తెలపడంతో ఐపీఎల్‌కు దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే. మే 29న బీసీసీఐ శుభవార్త చెబుతుందని క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.