శుక్రవారం ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

by  |
శుక్రవారం ఐపీఎల్ షెడ్యూల్ విడుదల
X

దిశ, స్పోర్ట్స్: యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పూర్తి షెడ్యూల్ శుక్రవారం విడుదల చేయనున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. గురువారం సాయంత్రంలోగా షెడ్యూల్‌లోని మార్పులు చేర్పులు పూర్తవుతాయని, మిగిలిన అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయని వెంటనే సెప్టెంబర్ 4న పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏబీపీ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన గంగూలీ ‘షెడ్యూల్ ప్రకటన ఆలస్యమైన విషయం మాకు కూడా తెలుసు. మార్పులు చేర్పులు అన్నీ పూర్తయ్యాయి.

శుక్రవారం తప్పకుండా పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తాం.’ అని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్‌ను ఇండియా వెలుపలికి తరలించాలని నిర్ణయం తీసుకొని నెల రోజులు గడిచినా షెడ్యూల్ ప్రకటించకపోవడంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. మరో రెండు వారాల్లో లీగ్ ప్రారంభం కానుండగా.. షెడ్యూల్ విడుదల చేయకపోవడం పలువురిని ఆశర్చర్యానికి గురిచేసింది. యూఏఈ ప్రభుత్వంతో ఉన్న కోవిడ్ ప్రోటోకాల్ అడ్డంకులే కారణమనే వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆటంకాలు ఏమీ లేకపోవడంతో శుక్రవారం విడుదల చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.



Next Story