- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్క్ ఉన్నా.. ఐఫోన్ అన్‌లాక్ చేయొచ్చు తెలుసా?
దిశ, ఫీచర్స్: కొవిడ్ కట్టడికి మాస్క్ తప్పనిసరి కాగా, ఫేస్ ఐడితో మొబైల్ అన్‌లాక్ చేసే వాళ్లకు దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మాస్క్ పెట్టుకోవడంతో, ఫేస్ రికగ్నైజ్ చేయకపోవడంతో, ప్రతిసారీ మాస్క్ తీయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇలా ఇబ్బందులు పడుతున్న తన వినియోగదారులకు ఆపిల్ ఓ గుడ్‌న్యూస్ అందించింది. ఫేస్ మాస్క్ తీయకుండానే ఐఫోన్‌ను అన్‌లాక్ చేసే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.
అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ తమ యూజర్ల కోసం ఐఓఎస్ 14.5 బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌తో మాస్క్ ధరించి ఉన్నా ఐఫోన్ హ్యాండ్‌సెట్ అన్‌లాక్ చేసే సదుపాయాన్ని కల్పించింది. ఇందుకోసం ఆపిల్ వాచ్ అవసరం. మాస్క్ ధరించి ఐఫోన్ స్క్రీన్ చూడగానే, ఆపిల్ వాచ్‌లో హాప్టిక్ ఫీడ్ బ్యాక్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ సాయంతో ఐఫోన్ అన్‌లాక్, లాక్ చేయొచ్చు. గతేడాది మేలో ఆపిల్ మాస్క్ పెట్టుకున్నా అన్‌లాక్ చేసే అప్‌డేట్ తీసుకురాగా, దానిలో మాస్క్ ధరించినప్పుడు ఫేస్ ఐడి ఆన్‌లాక్ కోసం పాస్ కోడ్ అడుగుతుంది. ఇక ఐవోస్ 14.5 బీటా వెర్షన్‌లో ‘సిరి’ని ఎమర్జెన్సీ సర్వీస్‌కు కాల్ చేసే సామర్థ్యంతో అప్‌డేట్ చేయడంతో పాటు, వాయిస్ అసిస్టెంట్‌ను ఉపయోగించి మెసేజ్ టైప్ చేయడానికి, పంపడానికి కొత్త ఇంటర్‌ఫేస్‌లను పరిచయం చేసింది.