- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్స్ కి అప్లై చేసుకోండిలా
దిశ, నిర్మల్ కల్చరల్: నిర్మల్ జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖా పరిధిలోని ఖాళీగా ఉన్న (32) పల్లె దవాఖాన డాక్టర్లుగా ( MBBS ) కాంట్రాక్టు పద్దతిన పనిచేయుటకు అర్హులయిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ధన్ రాజ్ తెలిపారు. దరఖాస్తులు సమర్పించుటకు చివరి తేది ఈనెల 18రోజున సాయత్రం 5 గంటల వరకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తుతోపాటు, అర్హత పత్రాలు జతచేసి అన్ని పని దినములలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం లో సమర్పించగలరని కోరారు. మరిన్ని వివరాల కొరకు nirmal.telangana.gov.in ని సందర్శించగలరని సూచించారు.
డిప్లొమా కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం..
నర్స్ ప్రాక్టీషనర్ మిడ్వైఫరి డిప్లొమా ( NPM ) కోర్స్ నిర్వహించుటకు అర్హతగల మహిళా అభ్యర్థుల కొరకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ ధన్ రాజ్ తెలిపారు. కనీస విద్యార్హత GNM / B.SC నర్సింగ్ డిగ్రీ ఉండి , అభ్యర్థుల వయస్సు 34 సంవత్సరాల కంటే తక్కువ ఉండవలెనని.. కనీసం 2 సంవత్సరాలు లేబర్ రూమ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 18 చివరితేదీ సాయంత్రం 5గం. వరకు ఉన్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ పూర్తయిన తరువాత ఒప్పంద ప్రాతిపదికపై నియమించబడతారన్నారు. 18 నెలల శిక్షణ కాలవ్యవధిలో నెలకు 23వేల రూపాయల పారితోషకం ఉంటుందన్నారు. వివరాలకు nirmal.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని పేర్కొన్నారు.